గీసుగొండ: వరంగల్: వంట చేస్తుండగా అంటుకున్న మంటలు.. వృద్ధురాలికి తీవ్ర గాయాలు
వరంగల్ జిల్లా వసంతపురంలో వంట చేస్తున్నప్పుడు చీరకు మంటలు అంటుకోవడంతో బలభద్ర కళమ్మ అనే వృద్ధురాలు గాయపడ్డారు. స్థానికులు మంటలను ఆర్పడంతో ప్రాణాపాయం తప్పింది. 108 సిబ్బంది ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.