నర్సంపేట: వరంగల్ జిల్లా గిర్నిబావిలో కొత్త హెల్త్ సెంటర్ కోసం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విజ్ఞప్తి
వరంగల్ జిల్లా గిర్నిబావిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఆయన వినతిపత్రం సమర్పించారు. నర్సంపేట సీహెచ్సీని జిల్లా ఆస్పత్రిగా మార్చడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.