రాయదుర్గం: కణేకల్లు మండలంలో హెచ్ఎల్సీ కాలువ దుస్థితిపై సిపిఐ నేతల క్షేత్ర స్థాయి పరిశీలన
తుంగభద్ర ఎగువ కాలువ దుస్థితిపై సిపిఐ నేతలు క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం కణేకల్లు మండలంలోని HLC కాలువ వెంబడి పర్యటించారు. అనంతపురం జిల్లా కు వరప్రదాయిని అయిన హెచ్ఎల్సీ కాలువలో నేటికీ పూర్తి స్థాయిలో నీటిని తీసుకోలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే బ్రిడ్జి లు కాలువ గట్లు మరమత్తు పనులు చేపట్టాలని కోరారు.