జనగాం: జనగామలో రైస్ డిపోలపై దాడులు: బియ్యం ధరలు మరియు తూకంలో తేడాలపై అధికారుల హెచ్చరిక
జనగామ జిల్లాలో తూనికల కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. తక్కువ తూకంతో విక్రయిస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన బిపిటి కిలో రూ.66, తెలంగాణ సోనా రూ.74, హెచ్ఎంటి రూ.79 ధరలను తప్పనిసరిగా పాటించాలని, దుకాణాల్లో ధరల పట్టిక ఉండాలని అధికారులు ఆదేశించారు.