నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలంలోని ఉప్పలపాడు వద్ద అక్టోబర్ 29వ తేదీన జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆత్మకూరు సీఐ గంగాధర్ తన సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. ఐసర్ వాహనం, ఎర్టిగా కారు ఢీకొట్టడంతో ప్రమాదంపై ఆరా తీశారు. ప్రమాద సమయంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా అందులో ప్రయాణిస్తున్న షేక్. మస్తాన్ బాషా ప్రమాదం జరిగినప్పటి నుంచి వెంటిలేటర్ పై ఉంటూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగిందని తెలిపారు.