నాగర్ కర్నూల్: నాగర్ కర్నూలు హాస్టళ్లలో పక్కా భవనాలు నిర్మించాలి: ఏబీవీపీ డిమాండ్
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బీసీ, ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పన, పక్కా భవనాల నిర్మాణం కోసం ఏబీవీపీ ఆందోళన బాట పట్టింది. వర్షపు నీరు గదుల్లోకి చేరడం, కరెంటు లేకపోవడం వంటి సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏబీవీపీ నేతలు తెలిపారు.