నెల్లూరు జిల్లా, ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఆర్డీవో బి.పావని అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాన్పుల విధానం, వైద్యశాలలో రోగుల వివరాల నమోదు లాంటి పలు అంశాలపై హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బందితో ఆత్మకూరు ఆర్డీవో పావని చర్చించారు. హాస్పిటల్లో సిజేరియన్ కాకుండా సాధారణ కాన్పులు జరిగేలా చూడాలన్నారు. అలాగే అభ యాప్ ద్వారా రోగుల ఆరోగ్య వివరాలు నమోదు చేయాలని సూచించారు.