నందికోట్కూరు: 49బన్నూరులో బూడిదైనా ఏళ్ళనాటి వృక్షం చిన్న అగ్గిపుల్ల పొరపాటుకు వృక్షం బలి
నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో గత ఎన్నో ఏళ్లుగా ఉన్న చెట్టు మంటల్లో బూడిద అయింది. గ్రామంలోని కందూనది దర్గా దగ్గర ఉన్న దాదాపు 200 సంవత్సరాల క్రితం చింత చెట్టుకు గత రెండు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు చెట్టు మొదలు దగ్గర నిప్పు అంటించడంతో అది కాస్త లోపల సొరంగంలో రగులుకుంటూ శుక్రవారం చెట్టు బయట విపరీతంగా మంటలు రావడంతో అంటుకోవడంతో చెట్టు ఎక్కడ విరిగి పడుతుందోనని ప్రయాణికులు భయాందోళన చెందారు. గమనించిన స్థానికులు ట్రాక్టర్ సహాయంతో నీళ్లను స్ప్రే చేసినా వంటలు అదుపులోకి రాలేదు.ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు తర్వాత చెట్టు లోపల నుంచి