నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు పట్టణ సమీపంలోని నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై ఓ స్కూటర్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తెల్లపాడు గ్రామానికి చెందిన ఓబుల్ రెడ్డికి తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లారు. నెల్లూరు పాలెం వద్ద పెట్రోల్ బంకులోకి వెళ్తుండగా, ఉదయగిరి నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారు ఈ స్కూటర్ ను ఢీకొంది. గాయపడిన ఓబుల్ రెడ్డిని చికిత్స నిమిత్తం నెల్లూరులోనే ఓ హాస్పిటల్ కి తరలించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.