గద్వాల్: ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలో చేరి ప్రజలను గాలికి వదిలేసిన ఎమ్మెల్యే:కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మణ్
గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 17వ తేదీన ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో జరిగిన వివాదానికి కారణం ఎవరో గద్వాల ప్రజలందరికి తెలుసునని,అందుకేనేమో కొందరు భుజాలు తడుముకుంటున్నారని ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శెట్టి ఆత్మకూరు లక్ష్మణ్..ప్రశ్నించారు.