సంగెం: వరంగల్: విద్యుదాఘాతంతో దగ్ధమైన ఇల్లు, రూ.4.70 లక్షల ఆస్తినష్టం
వరంగల్ జిల్లా సంగెం మండలం తిమ్మాపురం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పెంకుటిల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.4.70 లక్షల ఆస్తినష్టం జరిగింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.