శాలిగౌరారం: చిత్తలూరులో కొత్త తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖ ప్రారంభం
చిత్తలూరులో నూతనంగా ప్రారంభమైన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖను చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి, సర్పంచ్ గిరిగాని వెంకన్న, బొమ్మగాని రవి తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.