ఒంగోలు అర్బన్: సొంత ఊరిని ప్రతి ఒక్కరు గొప్పగా చూసుకోవాలి మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | Aug 16, 2026
150 సంవత్సరాల ఒంగోలు మున్సిపాలిటీ ఉత్సవాలకు సంబంధించిన బ్రోచార్ను ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ సొంత ఊరు అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టం ఉంటుందన్నారు. గ్రామం నుంచి పట్టణముగా, నగరంగా అభివృద్ధి చెందిన మన జిల్లా కేంద్రమైన ఒంగోలుకు కూడా గొప్ప చరిత్ర ఉందన్నారు. ఈ నగరం మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో మహిళల భద్రత, శాంతిభద్రతలలో మేటిగా నిలుస్తూ అత్యంత జీవనానుకూల నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు