నంద్యాల అర్బన్: నంద్యాలలో బొమ్మల సత్రం బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం
Nandyal Urban, Nandyal | Aug 16, 2026
నంద్యాల బొమ్మల సత్రం బ్రిడ్జిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటో అదుపుతప్పి ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టడంతో పాటు బ్రిడ్జి సైడ్ వాల్నూ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.