నర్సీపట్నం: అనకాపల్లి జిల్లాలో విషాదం: ఇంట్లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ఎస్.బీ. పట్నంలో అంబటి లోవ వెంకటేశ్ (44) ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగిందని ఎస్ఐ వై.తారకేశ్వరరావు తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు.