నల్గొండ: నల్గొండలో 13న చేయూత పెన్షన్ల పంపిణీ: హాజరుకానున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్గొండలో ఈనెల 13న ఏచూరి గార్డెన్స్‌లో చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఏర్పాట్లపై కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.