నందికోట్కూరు: హమారా ప్రసాద్ ను దేశ బహిష్కరణ చేయాలి మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయరాముడు
హమారా ప్రసాద్ పై వెంటనే కేసు నమోదు చేసి దేశ బహిష్కరణ చేయాలని మాల మహానాడు కమిటీ డిమాండ్ చేశారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శనివారం మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి జయరాముడు,డాక్టర్ డి వెంకటేష్,గౌరవ సలహాదారులు లాయర్ చెరుకు విజయకుమార్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హమారా ప్రసాద్ అనే వ్యక్తి అంబేద్కర్ పై కల్పిత నాయకుడు అనే ఒక పుస్తకం 750 పేజీలతో రచించాడు.ఈ పుస్తకాన్ని సెప్టెంబర్ 18 వ తారీఖున రిలీజ్ చేస్తానని సోషల్ మీడియా వేదికగా వీడియోలు షేర్ చేస్తున్నాడు.ఈ 'కల్పిత నాయకుడ'నే పుస్తకాన్ని పీవీ ర