ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో న్యాయవాద గుమాస్తాపై దాడి.. మత్తుమందు చల్లి బంగారు చైన్ చోరీ!
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో న్యాయవాద గుమాస్తాపై దాడి జరిగింది. భూమి తగాదా పేరుతో వచ్చిన దుండగులు, మత్తుమందు చల్లి రెండున్నర కాసుల బంగారు గొలుసును అపహరించారు. బాధితుడు నాగేశ్వరరావుకు చికిత్స అందిస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.