జనగాం: జనగామలో కొత్త సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు ప్రారంభం
జనగామ పట్టణంలోని 3వ వార్డులో UDIF నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ ప్రారంభించారు. అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.