సంగెం: వరంగల్ జిల్లాలో కోతుల స్వైరవిహారం: భయంతో వణికిపోతున్న గ్రామస్తులు
వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూర్ రంగంపేటలో కోతుల బెడద పెరిగింది. ఇళ్లలోకి చొరబడి వస్తువులను ఎత్తుకెళ్లడమే కాకుండా, ప్రజలపై దాడి చేస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.