డోన్: బేతంచెర్ల లో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమం
Dhone, Nandyal | Nov 12, 2026 విద్యార్థులు చదువుతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్ఎస్ రంగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు అబ్దుల్ అలీం, మెహతాబ్ సూచించారు. మండల పరిధిలోని గోరుమానుకొండ ఎంజేపీ పాఠశాలలో గురువారం విద్యార్థులకు దోమతెరలను పంపిణీ చేశారు. దోమకాటు వల్ల మలేరియా, డెంగీ, చికున్ గున్యా, బోధకాలు తదితర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వారు తెలిపారు.