తిరుమలగిరి: శామీర్పేట మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని షామీర్పేట మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ఆకస్మిక తనిఖీ చేశారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధతో పాఠాలు బోధించి ఉత్తమమైన విద్యను అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన తన మహోత్సవంలో కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటారు.