అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్లో 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం క్యాంపులు
ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 19 నుంచి నెల రోజుల పాటు 'ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం' క్యాంపులు నిర్వహించనున్నారు. లబ్ధిదారుల దరఖాస్తుల కోసం ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. రేషన్ కార్డు డేటా ఆధారంగా నామినీ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.