కొల్లాపూర్: కొల్లాపూర్లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.