ఇల్లంతకుంట: మానసా దేవి ఆలయాన్ని దర్శించుకున్న సినీ నటి శ్రీలక్ష్మి...
అమ్మవారిని దర్శించుకున్న సినీ నటి శ్రీలక్ష్మి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలోని సుప్రసిద్ధ స్వయంభుగా వెలసిన శ్రీ మానసాదేవి ఆలయాన్ని సినీ నటి శ్రీలక్ష్మి సోమవారం మద్య్హనం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏలేటి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికి సన్మానించి జ్ఞాపిక అందజేశారు. మానసాదేవి, అపురూప లక్ష్మి అమ్మవార్లకు శ్రీలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు.