మోత్కూర్: మోత్కూరు శ్మశానవాటికలో చిమ్మచీకటి.. లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్
మోత్కూరు మున్సిపాలిటీ శ్మశానవాటికలో విద్యుత్ దీపాలు లేకపోవడంతో అంత్యక్రియలకు వచ్చే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించి వెంటనే లైట్లు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బందెల శ్రీను డిమాండ్ చేశారు.