పార్వతీపురం: కురుపాం గిరిజన గురుకులంలో 44 మంది విద్యార్థులకు వైరల్ ఫీవర్
పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో 44 మంది విద్యార్థులు వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. దీనిపై ఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ, విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని మరియు ఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.