కొత్తపేట: రావులపాలెం: విద్యుత్ వైర్లు తెగిపోవడంతో పంట పొలాలకు నిలిచిన కరెంట్ సరఫరా
కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం పేదిరేశ్వరం-కేతరాజుపల్లి మార్గంలో తుఫాను ధాటికి విద్యుత్ స్తంభాలపై వైర్లు తెగిపడ్డాయి. దీనివల్ల పంట పొలాలకు విద్యుత్ అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించడం లేదని, వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కలెక్టర్కు రైతులు విజ్ఞప్తి చేశారు.