నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, మర్రిపాడు మండలం, కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 10వ తరగతి విద్యార్థిని మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. గురువారం అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులతో కలిసి కొందరు వారు స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంసంగా మారింది. మరోవైపు తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ తమ తండ్రి చేసిన ఆరోపణల మేరకు పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.