అదిలాబాద్ అర్బన్: 19 నుంచి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం - 5 లక్షల బీమా వర్తింపు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ బీమా పథకం ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. కుటుంబ పెద్ద అకాల మరణం చెందితే 5 లక్షల రూపాయల ఆర్థిక భరోసా కల్పించేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ విషయాన్ని మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆదిలాబాద్లో వెల్లడించారు.