పటాన్చెరు: గీతం యూనివర్సిటీలో ఘనంగా కాళోజీ నారాయణరావు 112వ జయంతి వేడుకలు
గీతం డీమ్డ్ యూనివర్సిటీలో కాళోజీ నారాయణరావు 112వ జయంతి వేడుకలు జరిగాయి. అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.