ఒంగోలు అర్బన్: ఒంగోలు లోని కొప్పోలు వద్ద పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
Ongole Urban, Prakasam | Aug 23, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు లోని కొప్పోలు వద్ద పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.51వేలు నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించామని అలానే ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్య నేరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.