హుజూర్ నగర్: హుజూర్నగర్: రామస్వామి గుట్ట వద్ద వీధి కుక్కల బీభత్సం - ఆందోళనలో ప్రజలు
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ రామస్వామి గుట్ట వద్ద వీధి కుక్కల స్వైరవిహారం చేస్తున్నాయి. పాదచారులు, ద్విచక్ర వాహనదారుల వెంట పడుతూ దాడికి యత్నిస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.