జనగాం: సరిపడ యూరియా నిల్వలు ఉన్నాయి:జిల్లా ఇంచార్జి కలెక్టర్ పింకేష్ కుమార్
బచ్చన్నపేట మండలం కేంద్రం లోని ప్రాథమిక సహకార సంఘాన్ని ఇంచార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.భౌతిక నిల్వలతో పాటు స్టాక్ రిజిస్టర్, రైతు వారి సేల్ రిజిస్టర్ను ఇంచార్జ్ కలెక్టర్ పరిశీలించారు.క్రౌడ్ కాకుండా..రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సక్రమంగా యూరియా పంపిణీ చేయాలన్నారు.ఇప్పటివరకు బచ్చన్నపేట మండలంలోని తొమ్మిది కేంద్రాల ద్వారా,సబ్ సెంటర్ల ద్వారా రైతులందరికీ యూరియా సరఫరా చేయడం జరుగుతుందని.బచ్చన్నపేట మండలంనకు ఇప్పటివరకు వివిధ డీలర్ల ద్వారా 848 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా జరిగిందన్నారు.