పరకాల: పరకాలలో ఫ్లెక్సీల చించివేత కలకలం: బీఆర్ఎస్లో పెరిగిన వర్గ విభేదాలు
హనుమకొండ జిల్లా పరకాలలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఫొటోలు లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.