విజయవాడ అర్బన్: గుడ్లవల్లేరులో శ్రీ శిరిడిసాయి మందిరంలో చోరీ.. హుండీ నగదు అపహరణ
గుడ్లవల్లేరు మండలం కొండేపాలెం శ్రీ శిరిడిసాయి మందిరంలో చోరీ జరిగింది. భక్తులు సమర్పించిన కానుకల హుండీ నగదును దుండగులు అపహరించారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్న ఆలయ కమిటీ, గుడ్లవల్లేరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది.