గజపతినగరం: గజపతినగరంలో ఘనంగా గైరమ్మ నిమజ్జన ఊరేగింపు
గజపతినగరంలో నాగుల చవితి సందర్భంగా గైరమ్మ నిమజ్జన ఊరేగింపు అట్టహాసంగా సాగింది. డప్పు వాయిద్యాలు, పులి వేషాలతో జరిగిన ఈ వేడుకలో స్థానికులు భారీగా పాల్గొన్నారు. ప్రతి ఏడాది ఎగువ, దిగువ వీధుల వారు వంతుల వారీగా ఈ పండుగను నిర్వహిస్తారు.