పెద్దఅడిశర్లపల్లి: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న స్వల్ప వరద ప్రవాహం, ప్రస్తుత నీటిమట్టం 523.80 అడుగులు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులో నిండడంతో ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా సాగర్ కు స్వల్ప వరద ప్రవాహం కొనసాగుతుంది. శనివారం మధ్యాహ్నం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 523.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 156.2964 TMCకు చేరింది. ఎడమ కాలువ ద్వారా తాగునీటి అవసరాల కోసం 2456 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, AMRP కల్వకు 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.