పెద్దఅడిశర్లపల్లి: నాగార్జునసాగర్ కు పెరిగిన పర్యాటకుల తాకిడి, బ్రిడ్జిపై ఏర్పడిన ట్రాఫిక్ జామ్, నిలిచిపోయిన వాహనాలు
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి పెరిగింది. 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో జల శోభను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. దీంతో నాగార్జునసాగర్ ప్రాంతంలో పర్యాయతకుల సందడి నెలకొంది. పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆదివారం సాయంత్రం సాగర్ నుండి మాచర్లకు వెళ్లే బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడి, వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మాచర్ల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో రావడంతో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.