ఉరవకొండ: అకాల గాలి వాన వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పెట్టుబడి ఖర్చు ప్రభుత్వం ఇవ్వాలి: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
అనంతపురం జిల్లా కూడేరు బెలుగుప్ప మండలాల్లో గత రెండు రోజులుగా అకాల గాలి వాన వల్ల పంటలు నష్టపోయిన గ్రామాల్లో ఏ పి రైతు సంఘం ప్రతినిదుల బృందం శుక్రవారం పర్యటించింది. కూడేరు మండలం చోళసముద్రం కడదరకుంట,బెళుగుప్ప మండలం రామసాగరం దుదేకుంట జీడిపల్లి గ్రామాలలో నష్టపోయిన అరటి మొక్కజొన్న వరి పంటలను ఏ పి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బి హెచ్ రాయుడు జిల్లా నాయకులు వెంకటేష్ వీరప్ప జయమ్మ సువర్ణమ్మ శ్రీనివాసులు రెడ్డి,శివశంకర్లు పంటలను పరిశీలించి పంటలు నష్టపోయిన రైతులు గొల్ల శివప్ప రామ భీమప్ప లక్ష్మీనారాయణ సరోజమ్మ మహేష్ నవీన్ రెడ్డి పూజారి నరసింహులు పరామర్శించి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.