ఐనవోలు: ఐనవోలులో బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ హౌస్ అరెస్టు
హన్మకొండ జిల్లా ఐనవోలులో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఒక ధర్నాలో పాల్గొనకుండా ముందస్తు చర్యగా పోలీసులు ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. దీంతో క్యాంపు కార్యాలయం వద్ద కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.