తిరుమలాయపాలెం: రైతుల ధాన్యం కొనుగోలుపై మంత్రి పొంగులేటి క్లారిటీ: ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అర్హులైన పేదలకు రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, 3, 4వ విడత పంపిణీ త్వరలోనే ఉంటుందని తెలిపారు. కేంద్రం సాయం చేయకున్నా ప్రజలను ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు.