మామిడికుదురు: మామిడికుదురు మండలంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు
మామిడికుదురు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం నాగుల చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. భక్తులు పుట్టల్లో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.