పెద్దాపురం: సామర్లకోట: స్ట్రాంగ్ రూమును పరిశీలించిన కమిషనర్, భారీ భద్రత ఏర్పాటు
సామర్లకోటలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు స్ట్రాంగ్ రూమును పరిశీలించారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామని, స్ట్రాంగ్ రూము వద్ద సీఐ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రత కల్పించామని అధికారులు తెలిపారు.