ఇల్లంతకుంట: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించిన జడ్జ్ రాధిక జైస్వాల్..
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించిన జడ్జి రాధిక జైస్వాల్... రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మద్య్హనం ఎడపల్లి అపర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారంతో చట్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.దీనికి ముఖ్య అతిథిగా డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జడ్జి రాధిక జస్వాల్ హాజరై మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకొని, మంచి చెడులను తెలుసుకొని, భవిష్యత్తులో నేరాలకు పాల్పడకుండా దేశాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.