మోత్కూర్: యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలు
యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం దాచారం స్టేజ్ వద్ద బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మేస్త్రీ కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.