చేర్యాల: చేర్యాలలో నిబంధనలకు విరుద్ధంగా టపాకాయల దుకాణాలు: ఆందోళనలో స్థానికులు!
చేర్యాల పట్టణంలో దీపావళి టపాకాయల దుకాణాలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. భద్రతా ప్రమాణాలు పాటించకుండా దుకాణాలను ఒకదాని పక్కన ఒకటి ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం 15 అడుగుల దూరం ఉండాలి కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు.