వర్ధన్నపేట: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైన వరంగల్ విద్యార్థి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సంకు యశ్వంత్ రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 13 నుంచి 15 వరకు బెల్లంపల్లిలో జరగనున్న ఈ పోటీల్లో యశ్వంత్ పాల్గొననున్నాడు. విద్యార్థిని సర్పంచ్, ఉపాధ్యాయులు అభినందించారు.