చింతలపాలెం: హుజూర్నగర్ రైతులకు గుడ్ న్యూస్: 53 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు
సూర్యాపేట జిల్లాలో రూ. 1,648 కోట్లతో నిర్మిస్తున్న ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని అధికారులకు సూచించారు.