గుంతకల్లు: పట్టణంలో ఇద్దరు సచివాలయ ఉద్యోగులపై మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ తేజ దాడి, పోలీసులకు ఫిర్యాదు
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని రాజేంద్రనగర్-2 సచివాలయ ఉద్యోగులు బి.సుధాకర్, రామాంజనేయులుపై గురువారం మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ తేజ దాడికి పాల్పడ్డాడు. బాధితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు పట్టణంలోని రాజేంద్రనగర్-2 సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సుధాకర్, రామాంజనేయులు ఇంటి పన్నుల వసూళ్లకు వెళ్ళారు. ఆటో డ్రైవర్ తేజ అటుగా వెళ్తూ చిన్నపాటి విషయంపై సచివాలయ ఉద్యోగులతో గొడవకు దిగాడు. ఫుల్ గా మద్యం సేవించిన ఆటో డ్రైవర్ తేజ నానా దుర్భాషలాడుతూ భౌతికంగా దాడికి పాల్పడ్డాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.